హైదరాబాద్, వెలుగు: బైక్ ట్యాక్సీలకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం రూల్ ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటికి ఒకే తరహా రూల్స్ ఉండాలని కన్జ్యూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ (కట్స్) తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఈ ట్యాక్సీలు కిలోమీటరుకు రూ.8– 10 వరకు మాత్రమే వసూలు చేస్తున్నాయి.
గిగ్ కార్మికులు నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదించగలుగుతున్నారు నిబంధనలలో తీవ్రమైన తేడాలు ఉండటం వల్ల కార్మికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. వీళ్లు తగిన భద్రతా ప్రమాణాలు పాటించేలా, ఈవీల వైపు మారేలా ప్రోత్సాహకాలు
అందించాలని ప్రభుత్వాన్ని కట్స్ కోరింది.
