ఆగని వానలు.. మరో మూడ్రోజులు ఇంతే

ఆగని వానలు.. మరో మూడ్రోజులు ఇంతే

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో మరో మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య, వాయువ్య జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌‌లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.