రబీ పంటలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

రబీ పంటలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

దీపావళి సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికిగానూ అన్ని రబీ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో క్వింటాలుకు గోధుమల ధర రూ.110, కుసుమల ధర రూ.209, కందుల (మసూర్) ధర రూ. 500, ఆవాల ధర రూ. 400, కుసుమ ధర రూ.209, శనగల ధర 105, బార్లీల ధర రూ.100 చొప్పున పెరిగింది.

దీంతో గోధుమలకు మద్దతు ధర క్వింటాకు రూ. 2125 కు చేరింది. బార్లీ మద్దతు ధర క్వింటాకు రూ.1735 గా.. ఆవాలు మద్దతు ధర క్వింటాకు రూ. 5450 గా, సన్ ఫ్లవర్ మద్దతు ధర క్వింటాకు రూ. 5650 గా కేబినెట్ నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో మద్దతు ధరల పెంపుపై నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు.