న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇన్సూరెన్స్ కంపెనీల్లో 100శాతం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్లను (ఎఫ్‌డీఐ) ఆటోమేటిక్ రూట్‌లో అనుమతించింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మరింత పెరగనుంది. అయితే ఎల్‌ఐసీ మాత్రం ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌లో కొనసాగుతుంది. ఈ కంపెనీలో గరిష్టంగా 20శాతం ఎఫ్‌డీఐకే ప్రభుత్వం అనుమతిచ్చింది.
సబ్ కా బీమా సబ్ క రక్షా చట్టం 2025కి అనుగుణంగా ఇది జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి చట్టంలోని ఎక్కువ భాగం అమల్లోకి వచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఎఫ్‌డీఐ లిమిట్ పెరిగినప్పుడు, కనీసం ఒక భారతీయ పౌరుడు చైర్మన్, ఎండీ లేదా సీఈఓగా ఉండాలి. అలాగే, షేర్‌హోల్డింగ్ పెరుగుదల ఆర్‌బీఐ, ఫెమా నియమాలకు అనుగుణంగా ఉండాలి.
