జూబ్లీహిల్స్, వెలుగు: సీబీఎస్ఈ ఓఎస్ఎం స్కామ్ కు నిరసనగా.. ఎన్ఎస్యూఐ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ మధురానగర్ లోని సీవోఈఎంపీటీ ఎడ్యు టెక్ప్రధాన కార్యాలయం ఎదుట నాయకులు ఆందోళన చేపట్టారు. రూ.385 కోట్ల విలువైన సీబీఎస్ఈ ఓఎస్ఎం కాంట్రాక్ట్ కేటాయింపులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి డిమాండ్ చేశారు. సీవోఈఎంపీటీ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఈ స్కామ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్‌చేశారు.
