లోక్ సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం

 లోక్ సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం

లోక్ సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు కేంద్ర అర్థిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్.  సరిగ్గా ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు.  డిజిటల్ రూపంలోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి.  ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు...మధ్యంతర బడ్జెట్..  త్వరలో పార్లమెంట్ ఎన్నికలున్న క్రమంలో  కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు  కార్యచరణ ప్రణాళికగా ఈ మూడు నెలల మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.   

మోదీ రెండో పర్యాయంలో ఇదే చివరి బడ్జెట్ కాగా  కొత్త పార్లమెంట్ లో ఇదే తొలి బడ్జె్ట్ కావడం విశేషం.  ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు  రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన నిర్మలా సీతారామన్ అక్కడ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు.ఈ సందర్భంగా   బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకున్నారు.  అనంతరం అక్కడినుంచి పార్లమెంట్ కు బయలు దేరారు.  అనంతరం పార్లమెంట్ లో కేంద్ర కేబినెట్ సమావేశమై మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.

నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో  బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఆరోసారి కావడం విశేషం.  ఐదుసార్లు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె ఈ సారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు.  దీంతో ఆమె రికార్డు నెలకొల్పారు.  గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ తరువాత వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన అర్థిక శాఖ మంత్రిగా ఆమె ఆరుదైన ఘనత సాధించారు. గతంలో లోక్‌సభలో మన్మోహన్‌ సింగ్, అరుణ్‌ జైట్లీ, చిదంబరం, యశ్వంత్‌ సిన్హాలు ఐదు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  ఇందిరా గాంధీ తరువాత  పార్లమెంట్ లో  బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండో మహిళా నిర్మలా సీతారామన్ కావడం విశేషం.