మంకీపాక్స్పై కేంద్రం గైడ్ లైన్స్

మంకీపాక్స్పై కేంద్రం గైడ్ లైన్స్

దేశంలో మంకీపాక్స్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ..కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది. దేశీ ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.విదేశీ ప్రయాణికులకు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. విదేశీ ప్రయాణికుల్లో అనారోగ్య సూచనలు కనిపించినా.. జంతువులతో కలిసి ఉన్నా..వారికి దూరంగా ఉండాలని తెలిపింది. 

   మంకీ పాక్స్  గైడ్లైన్స్

  • దేశీయ ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
  • విదేశీ ప్రయాణికులకు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • విదేశాల నుంచి వచ్చిన వారికి ఎలాంటి అనారోగ్య సూచనలు ఉన్నా.. జంతువులతో కలిసి ఉన్న వారికి దూరంగా ఉండాలి.
  • చర్మ గాయాలు , జననేంద్రియ గాయాలు ఉన్నవారితో, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరం పాటించాలి.  
  • ఎలుకలు, ఉడుతలు, కోతులకు దూరంగా ఉండాలి.
  • చనిపోయిన లేదా జీవించి ఉన్న అడవి జీవులను తాకరాదు. 
  • అడవి జంతువుల మాంసాన్ని లేదా వాటి నుంచి తయారుచేసిన ఎలాంటి ఉత్పత్తులను వాడవద్దు.
  • ఆఫ్రికా అడవుల్లోనీ జంతువుల నుంచి తయారు చేసిన ఎలాంటి ప్రొడక్ట్స్ వాడకూడదు.
  • దద్దుర్లు, జ్వరం వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.