
రాజన్నసిరిసిల్ల,వెలుగు: భారీ వర్షాలతో సిరిసిల్ల జిల్లాలోని బాధితులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాల ప్రజలను ఆదుకోవాలంటూ బీజేపీ స్టేట్ చీఫ్ పిలుపుతో కేంద్ర మంత్రి నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే జిల్లా కలెక్టర్ అందజేయనున్నట్లు చెప్పారు. వరదలతో నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు.