న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ (74) గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. పాశ్వాన్ హఠాన్మరణంతో ఆయన నేతృత్వం వహించిన ఆహార, ప్రజా పంపిణీ శాఖల బాధ్యతలను పీయూష్ గోయల్‌కు అప్పగించారు. ప్రస్తుతం రైల్వే శాఖతోపాటు వాణిజ్యం, పరిశ్రమ శాఖల మంత్రిగా గోయల్ వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోడీ సలహా మేరకు గోయల్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.
