విశ్వగురు స్థానంలోకి వెళ్లేలా విద్యార్థుల ఆలోచనలు ఉండాలె : కిషన్ రెడ్డి

విశ్వగురు స్థానంలోకి వెళ్లేలా విద్యార్థుల ఆలోచనలు ఉండాలె : కిషన్ రెడ్డి

పెద్దలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే కుగ్రామం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యారని అన్నారు. పటేల్ తీసుకున్న నిర్ణయం వల్ల స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆయన.. విశ్వగురు స్థానంలోకి వెళ్లేలా విద్యార్థుల ఆలోచనలు ఉండాలని చెప్పారు. 

2047కల్లా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని.. దేశాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వామం కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణగూడలోని కేశవ్ మెయోరియల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్పుతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.