కేజ్రీవాల్ అరెస్ట్ను కేసీఆర్ ఖండించడం గురిగింజ నీతే: కేంద్రమంత్రి కిషన్రెడ్డి

కేజ్రీవాల్ అరెస్ట్ను కేసీఆర్ ఖండించడం గురిగింజ నీతే: కేంద్రమంత్రి కిషన్రెడ్డి

హైదరాబాద్:  ఢిల్లీలో తీగ లాగితే తెలంగాణ డొంక కదిలింది.. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఖండించడం గురిగింజ నీతే అన్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. కేసీఆర్ కుటుంబం ఇన్ వాల్యుమెంట్ ఉందని అధికారులు చెప్పారు.  లిక్కర్ స్కాం కవితకు సంబంధం ఉందని.. నిధులు కేజ్రీవాల్ కు పంపారని ఈడీ అధికారులు చెపుతున్నారని అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండించిన కేసీఆర్ .. కూతురు కవిత అరెస్ట్ విషయంలో ఎందుకు స్పందించలేదని అన్నారు. కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ మౌనానికి కారణమేంటో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్టే బ్లాక్ డే ఎలా అవుతుంది కేసీఆర్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

తెలంగానలో దోచుకున్నట్లు.. కేసీఆర్ కుటుంబం ఢిల్లీలో కూడా దోచుకుంది.. కవిత అరెస్ట్ తో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు కిషన్ రెడ్డి. కవిత అరెస్ట్ తో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాదు అన్నారు. కాంగ్రెస్ , బీఆర్ ఎస్ లు బీజేపీని విమర్శిస్తున్నాయి.. అవినీతికి పాల్పడిన వాళ్లను కుంభకోణాలు చేసిన వాళ్లను విడిచి పెట్టాలని చెప్తున్నారా..ప్రజల రక్తం తాగుతున్న వాళ్లను వదిలిపెట్టాలా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బస్తీల ఎంట్రన్స్ లలోనే ఓపెన్ వైన్సులు, ఓపెన్ బార్లు ఏర్పాటు చేశారు... దీంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు.