దొంగలను తరిమిన తల్లీకూతుళ్లను అభినందించి ప్రశంసా పత్రాలు ఇచ్చిన కేంద్ర మంత్రి

దొంగలను తరిమిన తల్లీకూతుళ్లను అభినందించి ప్రశంసా పత్రాలు ఇచ్చిన  కేంద్ర మంత్రి

హైదరాబాద్: బేగంపేటలోని ఓ ఇంట్లో చోరీకి వచ్చిన దుండగులను చాకచక్యంగా తరిమేసిన ఘటన సమాజానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జైన్ కాలనీలో దోపిడికీ ప్రయత్నించిన దొంగలతో తెగువ చూపి పోరాడిన తల్లికూతుళ్లుని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. ఈ ఘటనలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన అమిత, భవి లకు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రశంసా పత్రాలను అందజేశారు. 

తుపాకీతో బెదిరించి దోపిడీకి యత్నించిన దొంగలను అడ్డుకొని వారిని ప్రతిఘటించి పోరాడిన తల్లి కూతుర్లు మహిళలకు ఆదర్శప్రాయమని అన్నారు. ప్రతి మహిళ విపత్కర సమయాలలో ఆత్మ రక్షణ నిమిత్తం ఎదుర్కొనేందుకు యుద్ధ కళలను నేర్చుకోవాలని సూచించారు. నారి శక్తి అంటే ఏంటో తల్లి కూతుర్లు నిరూపించారని ఆయన వారిని పొగిడారు. విద్యాసంస్థలలో చిన్ననాటి నుండి విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.