దేశ్ కీ నేత అంటూ డబ్బా కొట్టుకుంటున్నారు:కిషన్ రెడ్డి

 దేశ్ కీ నేత అంటూ డబ్బా కొట్టుకుంటున్నారు:కిషన్ రెడ్డి

సీఎం కేసీఆర్ అబద్దాల కోరు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు..కేసీఆర్ ప్రభుత్వం అబద్దాల మీదనే నడుస్తోందని మండిపడ్డారు.  కేసీఆర్ అబద్దాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని చెప్పారు. రానున్న రోజుల్లో కేసీఆర్ నిజస్వరూపం బట్టబయలు కాబోతుందన్నారు. 


కేసీఆర్ మోసాలను, అబద్దాలను వినేందుకు తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా లేరన్నారు.  కేసీఆర్ దేశ నాయకుడంటూ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నాయకుడు కావాలంటే ప్రజల్లో ఆ భావన రావాలన్నారు.