భాగ్యనగరాన్ని భ్రష్టుపట్టించి ప్రతిపక్షాలపై నిందలా ? : కిషన్ రెడ్డి

భాగ్యనగరాన్ని భ్రష్టుపట్టించి ప్రతిపక్షాలపై నిందలా ? : కిషన్ రెడ్డి
  • భాగ్యనగరాన్ని భ్రష్టుపట్టించి ప్రతిపక్షాలపై నిందలా ?
  • మేం నిర్మాణాత్మక సూచనలే చేస్తున్నం
  • కల్వకుంట్ల కుటుంబమే రాజకీయాలు చేస్తోంది
  • మంత్రి కేటీఆర్ కు  కిషన్ రెడ్డి కౌంటర్ 
  • జూబ్లీహిల్స్ వెంకటగిరిలో పర్యటించిన కేంద్ర మంత్రి 

హైదరాబాద్ :  భాగ్యనగరాన్ని భ్రష్టుపట్టిస్తూ  ప్రతిపక్షాలపై నిందలు వేస్తారా అని  రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శలకు బీజేపీ స్టేట్ చీఫ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ జూబ్లీహిల్స్ వెంకటగిరి డివిజన్ లో పొంగిపొర్లుతున్న నాలాలను ఆయన పరిశీలించారు. స్వయంగా నీళ్లలో నడుస్తూ సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి నుంచే  అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ‘ మేము రాజకీయం చేయడం లేదు. ప్రతిపక్షాలు   నిర్మాణాత్మక సూచనలు చేస్తుంటే... రాష్ట్రంలో  కల్వకుంట్ల కుటుంబం మాత్రమే  రాజకీయాలు చేస్తోంది. 

వారం రోజులుగా హైదరాబాద్​తోపాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అధిక వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.  జనజీవనం స్తంభించిపోయింది.హైదరాబాద్​లో వరద కాలువలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదు.  వర్షపు నీటి కాలువలు పూడిక తీయని కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పూడిక తీసే కాంట్రాక్టర్లకు జీహెచ్​ఎంసీ సకాలంలో బిల్లులు చెల్లించక పనులు ఆగిపోయాయి. హైదరాబాద్​ నగరాన్ని ఇస్తాంబుల్​ చేస్తం.. సింగపూర్​, లండన్​, న్యూయార్క్, వాషింగ్టన్​​ చేస్తామని  ముఖ్యమంత్రి  అనేక సార్లు చెప్పారు. కానీ చిన్న వర్షాని కే హైదరాబాద్​ అతలాకుతలమై జన జీవనం స్తంభించిపోయింది’ అని కిషన్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు.