కవితను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు : కిషన్ రెడ్డి

కవితను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు : కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ రౌడీయిజానికి పాల్పడుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ అర్వింద్ ఇంటిని ఆయన పరిశీలించారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై అర్వింద్ కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. కవితను చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇతర పార్టీల్లో ఉన్నవారిని తన పార్టీలో చేర్చుకునే మొదటి వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. ఫిరాయింపులపై  కేసులు పెట్టాల్సి వస్తే ముందు కేసీఆర్ పై పెట్టాలన్నారు.

కుటుంబపాలనను పాతరేసే రోజులొచ్చాయని కిషన్ రెడ్డి అన్నారు. అధికారం ప్రజలిస్తారు..ఇతర పార్టీల వారు కాదని వ్యాఖ్యానించారు. ప్రచార ఆర్భాటం కోసమే సిట్ అంటూ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. బీజేపీకి నాయకత్వం లోపం లేదన్నారు. రాష్ట్రాన్ని నిజాం రాజ్యంగా మార్చారని విమర్శించారు.