
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: రైల్వే లను కేంద్ర ప్రభుత్వం అమ్మాలని అనుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జీవిత భీమా సంస్థ (ఎల్ఐసి)ని అమ్ముతున్నారని కేసీఆర్ కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల ఇళ్ల పట్టాల సంగతి ఏంది ? నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏది..?కేంద్రం పెట్టకపోతే మేమే పెడతామన్న స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ..? అని అడుగుతున్నామన్నారు. కరోన సమయం లో రాష్ట్రానికి శనగ పప్పు ఇస్తే పంచలేదని ఆయన ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ జరుగుతుందో, ఎక్కడయితే టీఆర్ఎస్ లీడర్ల వ్యాపారాలు ఉంటాయో అక్కడ మాత్రం రోడ్లు వేస్తారు, మిగతా ప్రాంతాల్లో వేయరని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ అబద్ధాల పై ప్రజల్లోకి వెళ్లి నిజాలు బయట పెట్టాలని ఆయన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
డిల్లీకి అగ్గి పెడుతున్నం , యుద్ధం చేస్తామని అన్నారు, యుద్ధం ఎవరు మీద చేస్తారు? మీరు ఎలాంటి భాష మాట్లాడారు, ఆ రకమైన భాష కు అంకురం పోసిందే మీరు, సీఎం ఆయిన మీ భాషలో మార్పు రాలేదు, మీరు మాట్లాడొచ్చు కానీ ఇతరులు మాట్లాడకూడదా ? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ లో దాన్యం కొనుగోలు మీద కేంద్రం 26 వేల 600 కోట్లు పెడుతుందని, అలాగే బీజేపీ ఎప్పుడు కూడా ఫలానా పంట వేయాలని చెప్పలేదన్నారు. ధాన్యం వర్షంలో తడిచిపోతుంటే కొనుగోలు చేయొద్దని బీజేపీ ప్రభుత్వం చెప్పిందా ? అని ఆయన నిలదీశారు. కేసీఆర్ మాత్రం ఒక్కోసారి ఒక్కో పంట వేయాలని చెప్పారు, ప్రస్తుత పంట కొనకుండా వచ్చే పంట గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆయన ప్రశ్నించారు.
ధాన్యం కొనేది కేంద్రమే అని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చెప్పినందుకు సంతోషం
ధాన్యం కొనేది కేంద్రమే అని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు చెప్పినందుకు సంతోషం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నిన్న డిల్లికి వచ్చిన మంత్రులు వ్యూహాత్మకంగా తప్పుడు సమాచారం ఇచ్చారని, ఇందిరా పార్కు ధర్నా పుత్ర వాత్స్యల్యం కోసం ధర్నా.. తరవాత తన కొడుకు సీఎం కావాలని ధర్నా.. అని ఆయన ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ప్రజల దృష్టి మరల్చేందుకే ధర్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బాయిల్డ్ రైస్ ని రైతులు పండించరని, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ప్రకారం రా రైస్ కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట మారుస్తోందని నిలదీసిన కేంద్ర మంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీని దోషి గా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
https://www.youtube.com/watch?v=05yUhro2Gn4