
న్యూఢిల్లీ, వెలుగు: రష్యాలోని మాస్కోలో జరగనున్న ‘రష్యన్ ఎనర్జీ వీక్’ 8వ అంతర్జాతీయ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ నెల 15 నుంచి 17 వరకు మూడ్రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది.
ఈ మేరకు కేంద్ర రష్యా ఫెడరేషన్ రాయబారి కార్యాలయం నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సలహాదారు, రష్యన్ ఎనర్జీ వీక్ ఆర్గనైజింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఆంటన్ కొబ్యాకోవ్ ఆహ్వానం పంపారని శుక్రవారం కేంద్ర మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘రాస్ కాంగ్రెస్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సులో ‘క్రియేటింగ్ ది ఎనర్జీ ఆఫ్ ది ఫ్యూచర్ టుగెదర్’ అనే అంశంపై చర్చ జరగనుంది.