
పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ వెల్లడించిన ఆకాంక్షలను నెరవేర్చాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7 లోని మెరీడియన్ స్కూల్లో నిర్వహించిన పరీక్ష పే చర్చలో ఆయన పాల్గొన్నారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవిస్తూ వారు చెప్పిన విధంగా నడుచుకోవాలని సూచించారు. దేశ విశిష్టతను చాటేలా అద్భుత వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. బాగా చదువుకుని దేశాభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ప్రపంచలోనే యూత్ పాపులేషన్ లో భారత్ నంబర్ వన్ స్థానంలో ఉందని.. రానున్న 25 ఏళ్లు దేశాభివృద్ధికి ఎంతో కీలకమన్నారు. భారత్ ను ప్రపంచానికే విశ్వగురు స్థానంలో నిలిపేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.