మామునూరు ఎయిర్ పోర్ట్కు భూములివ్వడం లేదు

మామునూరు ఎయిర్ పోర్ట్కు భూములివ్వడం లేదు

వరంగల్: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ లోని వేయి స్తంభాల గుడిని దర్శించుకున్న మంత్రి మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రధాని అయ్యాక వరంగల్ సిటీకి అధిక ప్రాధాన్యమిచ్చారన్న ఆయన... ఈ క్రమంలోనే వరంగల్ ను హెరిటేజ్ సిటీగా ప్రకటించామన్నారు. వేయి స్తంభాల గుడి అభివృద్ధిలో భాగంగా రూ.15 కోట్ల ఖర్చుతో కల్యాణ మండప పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. రూ.50 కోట్లకు పైగా నిధులతో రామప్పను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మామునూరు ఎయిర్ పోర్ట్ కోసం భూమి కావాలని ఎన్ని సార్లు చెప్పినా... రాష్ట్ర సర్కారు పట్టించుకోవడంలేదన్నారు. భద్రాచలం టెంపుల్ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, డీపీఆర్ రాగానే పనులు చేపడుతామని చెప్పారు. ఇక జోగులాంబ టెంపుల్ కోసం రూ.33 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఎవరెన్ని అనుకున్నా తాము పట్టించుకోమని, ములుగులో ట్రైబల్ సర్క్యూట్ ను అభివృద్ధి చేస్తామని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే

సీఎం కేసీఆర్ కు ఓటమి భయం