- అసెంబ్లీ ఎన్నికల్లో మాది మూడో స్థానం
- లోక్ సభ నాటికి రెండో స్థానానికి వచ్చాం
- బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయ్
- మీట్ ది ప్రెస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: తాము సర్వేలను విశ్వసించడం లేదని, జూబ్లీహిల్స్ ఓటరు ఇంకా ఓటెవరికి వేయాలనేదానిపై డిసైడ్ కాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎవరూ కోరుకోనిదని చెప్పారు. జూబ్లీహిల్స్ లో ఇప్పటి వరకు బీజేపీ విజయం సాధించలేదని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్నామని, పార్లమెంటు ఎన్నికల నాటికి రెండో స్థానానికి వచ్చామని వివరించారు. ప్రస్తుతం త్రిముఖ పోరు జరుగుతోందని అన్నారు.
►ALSO READ | బాల కార్మికుల నిర్మూలనకు కాంగ్రెస్ సర్కార్ చాలా పథకాలు తెచ్చింది: మంత్రి వివేక్
జూబ్లీహిల్స్ ప్రజలు ఎవ్వరికి ఓటు వేయాలి అనేదానిపై స్పష్టమైన ఆలోచనకు రాలేదని చెప్పారు. ఒక గ్రామ పంచాయతీలో ఉండే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్ లో లేదని అన్నారు. సింగపూర్, ఇస్తాంబుల్, డల్లాస్ చేస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్లు కనీస అభివృద్ధి కూడా చేయలేక పోయారని విమర్శించారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని విమర్శించారు. వాటి గురించి చెప్పకుండా కాంగ్రెస్ నేతలు రాజకీయ విమర్శలకు దిగుతున్నారని అన్నారు. మజ్లీస్ మెప్పు కోసం ముఖ్యమంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బోరబండలో పాదయాత్ర చేస్తే ఎంత మేర అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని అన్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
