బాల కార్మికుల నిర్మూలనకు కాంగ్రెస్ సర్కార్ చాలా పథకాలు తెచ్చింది: మంత్రి వివేక్

బాల కార్మికుల నిర్మూలనకు కాంగ్రెస్ సర్కార్ చాలా పథకాలు తెచ్చింది: మంత్రి వివేక్

తెలంగాణ ప్రభుత్వం కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ హోటల్ లో   అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో బాల కార్మికుల నిర్మూలనకు కృషి చేస్తున్న చైల్డ్ లేబర్ ప్లాట్‌ఫామ్ (Child Labour Platform) 16వ వార్షిక సమావేశం  జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో పలు దేశాల ప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు, బాలకార్మికుల నిర్మూలన కోసం పనిచేస్తున్న సంస్థలు పాల్గొన్నాయి.

►ALSO READ | జూబ్లీహిల్స్ బై పోల్..ఈ 12 కార్డుల్లో ఏ ఒక్క కార్డున్నా ఓటు వేయొచ్చు

ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి వివేక్.. రాష్ట్రంలో బాల కార్మికుల నిర్మూలకు కృషి చేస్తున్నామని చెప్పారు.  అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నాం.  ప్రతి జిల్లాలో చైల్డ్ లేబర్ టాస్క్ ఫోర్సులను బలోపేతం చేశాం.  చైల్డ్ లేబర్ ప్రభావిత పిల్లల రక్షణ, పునరావాసం కోసం కృషి చేస్తున్నాం. బ్రిడ్జ్ స్కూల్స్, వృత్తి ఆధారిత శిక్షణా కేంద్రాలను విస్తరించాం.  ILOతో మా భాగస్వామ్యం ద్వారా వ్యవసాయం, ఇటుక భట్టీలు, పట్టణ అనధికార రంగాలలో సామాజిక రక్షణ, నైపుణ్యాభివృద్ధి, పెద్దలకు గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలను సమన్వయం చేసే ఏరియా బేస్డ్ విధానాలను విజయవంతంగా ప్రయోగాత్మకంగా అమలు చేశాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం, సమాచార సాంకేతికం (IT), ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ రంగాలలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా ఎదిగింది.  అభివృద్ధి, పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలను స్వాగతిస్తూ, ఆర్థిక వృద్ధి సమగ్రంగా, నైతికంగా కొనసాగేందుకు కట్టుబడి ఉన్నాము’ అని తెలిపారు.