హెరిటేజ్ కట్టడాలను సర్కార్‌‌‌‌‌‌‌‌ పట్టించుకుంటలే

హెరిటేజ్ కట్టడాలను సర్కార్‌‌‌‌‌‌‌‌ పట్టించుకుంటలే
  • ఏపీ 120 కట్టడాల పేర్లను పంపిస్తే.. తెలంగాణ ఎనిమిదే పంపింది
  • నిర్మాణాలను గుర్తించడంలో సర్కార్‌‌‌‌‌‌‌‌ ఫెయిలైంది: కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో హెరిటేజ్ కట్టడాలు ఎన్నో ఉన్నప్పటికీ ఎనిమిది కట్టడాల పేర్లను మాత్రమే ప్రభుత్వం కేంద్ర పురావస్తు శాఖకు పంపించిందని కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి అన్నారు. ఏపీ నుంచి 120 కట్టడాల పేర్లు కేంద్రానికి వచ్చాయని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ నుంచి వెయ్యి స్తంభాల గుడి, రామప్ప టెంపుల్‌‌‌‌తో పాటు మరో ఆరు ఉన్నాయన్నారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌‌‌‌ ఇండియా (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో హెరిటేజ్‌‌‌‌ కట్టడాలను గుర్తించడంలో రాష్ట్ర పాలకులు ఫెయిలయ్యారని మండిపడ్డారు. గొప్ప చరిత్ర ఉన్న కట్టడాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయని, వాటిని సర్కార్‌‌‌‌‌‌‌‌ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. హెరిటేజ్ కట్టడాల అభివృద్ధి, రక్షణ కల్పించే బాధ్యత తనపై ఉందని, కట్టడాలకు మతంతో సంబంధం లేదన్నా రు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌ బర్కత్‌‌‌‌పురలోని సిటీ సెంట్రల్‌‌‌‌ బీజేపీ ఆఫీస్‌‌‌‌కు కిషన్‌‌‌‌ రెడ్డి వచ్చారు. ఆయనకు పార్టీ సిటీ అధ్యక్షుడు గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, కార్పొరేటర్లు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్టీ మహిళలకు ఐదు కేజీల చొప్పున బియ్యాన్ని ఆయన పంపిణీ చేశారు. తర్వాత ఉత్తరప్రదేశ్​ మాజీ సీఎం కల్యాణ్‌‌‌‌ సింగ్‌‌‌‌ మృతికి సంతాపం తెలిపారు. హెరిటేజ్ 
కట్టడాలు షూటింగ్‌‌‌‌లకు ఇవ్వాలని చిరంజీవి, మోహన్‌‌‌‌ బాబు ఫోన్‌‌‌‌ చేసి కోరారని తెలిపారు. మహారాష్ట్రలో ఉన్న కట్టడాలను ఇప్పటికే షూటింగ్‌‌‌‌లకు ఇచ్చామన్నారు. కరోనా కారణంగా రెండేండ్ల నుంచి టూరిజం డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ రెవెన్యూ పడిపోయిందని, ఇతర దేశాల నుంచి టూరిస్టులు రావటం లేదని చెప్పారు. రామ జన్మ భూమిలో దొరికిన పురాతన వస్తువుల్ని మ్యూజియంలో ఉంచుతామన్నారు. జన ఆశీర్వాద యాత్ర అప్పుడే పూర్తి కాలేదని చెప్పారు. వచ్చే కార్పొరేషన్‌‌‌‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేలా పనిచేయాలని కార్పొరేటర్లకు కిషన్‌‌‌‌రెడ్డి సూచించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కనిపించదని, రాష్ట్రంలో కూడా ఆ పార్టీ మునిగిపోయిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆదివాసీ మ్యూజియానికి సపోర్ట్​ చేస్తం
ఆదివాసీ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర  మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్​ మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఆద్య కళ గిరిజన జానపద కళా ఖండాల ఎగ్జిబిషన్​ను ఆదివారం ఆయన సందర్శించారు. నాలుగు గ్యాలరీలలో తిరిగి కళారూపాలను చూశారు. అనేక ఏండ్లుగా జీవితాన్ని అంకితం చేసి, ఒక తపస్సులా చేపట్టి ఆ ఫలితాలను చూపించారని ప్రొఫెసర్​ జయధీర్ తిరుమలరావును కిషన్​రెడ్డి అభినందించారు. ప్రభుత్వాలు చేయని పనులను 45 ఏండ్ల నుంచి ఒక కమిట్ మెంట్ తో జయధీర్ తిరుమల రావు చేస్తున్నారని, మన ఆదివాసీ, గిరిజన వారసత్వ సంపదను కాపాడుతున్నారని, మూడు వేల ఆదివాసీ వస్తువులను సేకరించారని కొనియాడారు. చారిత్రక వారసత్వ సంపదను కాపాడటం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని కిషన్​రెడ్డి హామీ ఇచ్చారు. 

ఆదివాసీ చరిత్రను కాపాడుకోవాలి: మంత్రి శ్రీనివాస్​గౌడ్​
ఆదివాసీ కళలు, నాగరికత ను కాపాడాలని మొదటి నుంచి కష్ట పడుతున్న వ్యక్తి జయధీర్ తిరుమలరావు అని, దేశం గర్వించదగ్గ అవార్డు ఏదైనా ఉంటే ఆయనకు ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్  అన్నారు. ఆదివాసీ చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎక్కువ నిధులు తీసుకువచ్చేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు మాట్లాడుతూ.. ఆదివాసీ వస్తువులు, నాగరికత, కళలు, చరిత్రను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు.