
తెలంగాణ తల్లి కల్వకుంట్ల కుటుంబానికి బానిస అయిందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణను బానిసగా చేసి కేసీఆర్ పాలిస్తున్నారని ఫైరయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా.. దంతాలపల్లిలో మాట్లాడారు. పోరాడి సాధించిన తెలంగాణ... తండ్రి కొడుకుల పాలైందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అప్పుల పాలు చేశారన్నారు. మరికొద్దిరోజులు కేసీఆర్ పాలన ఇలాగే సాగితే.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరన్నారు. రాష్ట్రం దివాళా తీయడం కేసీఆర్ ప్రాజెక్టులు, ఎలక్షన్ల పేరుతో వందల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం అనేక పథకాలతో రాష్ట్రానికి నిధులు ఇస్తోందని..నరేంద్ర మోడీ డబ్బులు ఇస్తే.. ప్రచారం తండ్రి కొడుకులవన్నారు.