జులై 13న కొత్తగూడెంకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి రాక

జులై 13న కొత్తగూడెంకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి రాక

భద్రాద్రికొత్తగూడెం/ జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: ఈ నెల 13న భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​ రెడ్డి పర్యటించనున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పార్టీ ఆఫీస్​లో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ పర్యటనలో కేంద్ర మంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారని తెలిపారు. తాడిచర్ల–2 కోల్ బ్లాక్​ను సింగరేణికి కేంద్రం ఇవ్వడాన్ని పురస్కరించుకొని కొత్తగూడెంలో సంబురాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. 

కాగా, సోమవారం సాయంత్రం జయశంకర్​భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి రానున్నారు. బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, జెన్​కో గెస్ట్​హైస్​లో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం కేటీకే 8వ గని వద్ద సింగరేణి కార్మికులతో మీటింగ్​లో పాల్గొంటారు. మల్హర్​ మండలం తాడిచెర్ల బ్లాక్–2 ప్రాజెక్టును సందర్శించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్​రెడ్డి వివరించారు.