విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంద్రకీలాద్రికి చేరుకున్న కిషన్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, గుడి అధికారులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… మోడీ నాయకత్వంలో దేశంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. పర్యటనలో భాగంగా అమ్మవారిని దర్శించుకునే బాగ్యం కలిగిందని కిషన్ రెడ్డి తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. విజయవాడ నుంచి బయలుదేరి ఒంగోలులోని ఎమ్మార్పీఎస్ సమావేశంలో పాల్గొనబోతున్నట్లు తెలిపారు. రేపు ఢిల్లీలో మూడు బిల్లులు ప్రవేశ పెడుతున్నామని అందులో ముఖ్యంగా… వేరే దేశాల్లో ఉన్న భారతీయులపై దాడులు , నష్టాలు జరిగితే వాటిని ఎన్.ఐ.ఏ పరిధిలోకి తీసుకువచ్చే విధంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే విధంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టబోతున్నామని చెప్పారు కిషన్ రెడ్డి.
