చర్లపల్లి, నాగులపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సహకరించాలె

చర్లపల్లి, నాగులపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సహకరించాలె

సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి, నాగులపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సహకరించాలని లేఖలో కోరారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ పార్కింగ్ కు అప్రోచ్ రోడ్డు స్థలాన్ని కేటాయించాలని, నాగులపల్లి టెర్మినల్, పార్కింగ్, అప్రోచ్ రోడ్డుకు 350 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని పేర్కొన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లలో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో చర్లపల్లి స్టేషన్ ను అభివృద్ధి చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వేశాఖ నిర్ణయించింది. భూమి కేటాయించాలని 2020లో నిర్ణయం తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్థలాన్ని కేటాయించలేదు. వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తారని ఆశిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.