
కమలాపూర్: దళితులతో పాటు గౌడ కులస్థులకు కూడా గౌడబంధు ఇవ్వాలని కేంద్రమంత్రి మురళీధరన్ డిమాండ్ చేశారు. కమలాపూర్‌లో జరిగిన గౌడగర్జన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గౌడ సమాజానికి తెలంగాణ సీఎం ఇచ్చిన హమీలను అమలు చేయలేదన్నారు. ఎన్నికలప్పుడే కేసీఆర్‌కు ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తూ పాలన సాగిస్తుందని ఆయన అన్నారు. అట్టడుగు, దళిత వర్గాలకు అండగా ఉండాలని మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు.