ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం.. కాళేశ్వరం స్కామ్

ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం.. కాళేశ్వరం స్కామ్
  • అవినీతి జరిగినట్టు కవిత కూడా ఒప్పుకుంది: బండి సంజయ్ 
  • ఈ కేసు విచారణపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్  
  • హైకోర్టులో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిలీఫ్ వచ్చేలా చేసింది 
  • కరెంట్ కొనుగోళ్లు, ఫార్ములా-ఈ, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్ కేసులను సీబీఐకి ఎందుకిస్త లేరని ప్రశ్న 

కరీంనగర్, వెలుగు: కాళేశ్వరం స్కామ్.. ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసీఆర్ బిడ్డ కవిత కూడా ఒప్పుకున్నారని పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. 

దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావుతో కలిసి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని మొట్టమొదట డిమాండ్ చేసింది తానేనని పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం విచారణ విషయంలో కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతున్నది. అసెంబ్లీలో సీబీఐ విచారణ చేయాలని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం..హైకోర్టులో మాత్రం సరైన వాదనలు వినిపించకుండా బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిలీఫ్ వచ్చేలా చేసింది” అని మండిపడ్డారు. 

విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై నివేదిక వచ్చినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. కరెంట్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా–ఈ, గొర్రెల స్కామ్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ‘‘నక్సలిజం ఫిలాసఫీ అని రేవంత్ రెడ్డి మాట్లాడితే.. కాంగ్రెస్ కూటమి అభ్యర్ధి జస్టిస్ సుదర్శన్ రెడ్డి దానికి అనుకూలంగా మాట్లాడటం విడ్డూరం. 

నక్సలైట్లు కాల్చి చంపిన కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యులైన శ్రీధర్ బాబు, పర్ణికారెడ్డి నక్సలిజం ఫిలాసఫీని ఆమోదిస్తారా?. నక్సలైట్ల విషయంలో కేంద్రం క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని అంతమొందించి తీరుతాం” అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

ఏ గ్రామంలోనైతే బీజేపీ అభ్యర్థిని ఎంపీటీసీగా గెలిపించుకుంటారో ఆ గ్రామానికి రూ.5 లక్షల నజరానా ఇస్తానని, ఏ మండలంలోనైతే బీజేపీ అభ్యర్థిని జడ్పీటీసీగా గెలిపించుకుంటారో ఆ మండలానికి రూ.10 లక్షలు ఇస్తానని సమావేశంలో ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 9వ తరగతి విద్యార్థులకు కూడా త్వరలో సైకిళ్లు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.