
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ పార్టీకి యునైటెడ్ ముస్లిం ఫోరం మద్దతు ప్రకటించింది. శుక్రవారం బేగంపేట క్యాంపు ఆఫీస్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి ఎన్నికల్లో మద్దతునిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత మైనార్టీల స్థితిగతుల్లో చాలా మార్పులు వచ్చాయని, ఇందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. మైనార్టీ గురుకులాలతో విద్యార్థుల భవిష్యత్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.
షాదీ ముబారక్‌తో పేదలకు మేలు జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత ఘర్షణలు లేవని, ఒక్కరోజు కూడా కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరమే రాలేదన్నారు. గంగా జమున తెహజీబ్‌గా తెలంగాణ వర్ధిల్లుతుందని వెల్లడించారు. బీఆర్ఎస్కు మద్దతు తెలిపిన యునైటెడ్ ముస్లిం ఫోరం నాయకులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్‌ను కలిసినవారిలో మౌలానా అక్బర్ నిజాముద్దీన్, జియావుద్దీన్నయ్యర్ జహీరుద్దీన్ అలీ తదితరులుఉన్నారు.