 
                                    - బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
బషీర్బాగ్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల సాధనకు యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలుగా మారాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఓయూ బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న బీసీల ధర్మ పోరాట దీక్ష పోస్టర్ను రవీంద్రభారతి ప్రాంగణంలో గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం జర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెడ్డి జాగృతి అడ్డుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిపై ఒత్తిడి తేవాలన్నారు.
ఓయూలో పోస్టర్ ఆవిష్కరణ..
ఓయూ: ఓయూలో చేపట్టనున్న ధర్మ దీక్ష వాల్పోస్టర్ను ఆర్ట్స్ కాలేజీ వద్ద ఓయూ జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. విద్యార్థులు, మేధావులు, బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

 
         
                     
                     
                    