క్వశ్చన్ అవర్ తొలగింపు అన్యాయం.. ప్రతిపక్షాల గగ్గోలు

క్వశ్చన్ అవర్ తొలగింపు అన్యాయం.. ప్రతిపక్షాల గగ్గోలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ మాన్ సూన్ సెషన్ తర్వలోనే ఆరంభమవనుంది. ఈ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ ను తీసేయాలని నిర్ణయించారు. దీనిపై రగడ నడుస్తోంది. క్వశ్చన్ అవర్ ను ఎందుకు తొలగించారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తాజాగా సీపీఐ రాజ్య సభ మెంబర్ బినోయ్ విస్వం క్వశ్చన్ అవర్ తొలగింపుపై వైస్ ప్రెసిడెంట్, అప్పర్ హౌజ్ చైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు.

‘పార్లమెంట్ సమావేశాలకు కేటాయించిన సమయం గతంతో ఎంత ఉండేదో అంతే. క్వశ్చన్ అవర్ సస్పెన్షన్ చేయడం అన్యాయం. వెంటనే దీన్ని పునరుద్ధరించండి. పార్లమెంట్ ప్రజాస్వామ్య నిర్వహణలో క్వశ్చన్ అవర్, జీరో అవర్ అంతర్భాగం. ఇవి లేకుండా స్వాతంత్ర్య భారత చరిత్రలో పార్లమెట్ సమావేశాలు ఇంతవరకు జరగలేదు. ఇలాంటి మార్పులను ప్రవేశ పెట్డడం వల్ల పార్లమెంట్, దాన్ని నమ్ముకున్న ప్రజలపై ప్రభుత్వం ఎంత జవాబుదారీతనాన్ని కలిగి ఉందో తెలుస్తోంది’ అని విస్వం చెప్పారు. కరోనా కారణంగా మాన్ సూన్ సెషన్స్ లో క్వశ్చన్ అవర్ ఉండబోదని రాజ్య సభ సెక్రటేరియట్ మంగళవారం ఒక నోటిఫికేషన్ లో తెలిపారు. ఈ నెల 14న మొదలవనున్న పార్లమెంట్ సమావేశాలు వచ్చే నెల 1వ తేదీతో ముగుస్తాయి.