అంబర్పేట్, వెలుగు: అంబర్పేట పోలీస్ లైన్లోని బాపు నగర్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆక్వా మెగా వాటర్ ప్లాంట్లో ఫుడ్సేఫ్టీ, టాస్క్ఫోర్స్, స్థానిక పోలీస్ అధికారులు కలిసి మంగళవారం తనిఖీలు చేపట్టారు. లేబిలింగ్ నిబంధనలు పాటించకుండా, అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నీటి ప్యాకెట్లను తయారు చేస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు.
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ప్లాంట్ నిర్వాహకుడు మహ్మద్ నయీమ్ ఉద్దీన్ (35)ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో సుమారు రూ. 2.80 లక్షల విలువైన 100 వాటర్ ప్యాకెట్ల బస్తాలు, మూడు ప్యాకింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ టి. కిరణ్ కుమార్ తెలిపారు
