తెలంగాణ పలు జిల్లాల్లో అకాల వర్షాలు.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన జొన్నలు

తెలంగాణ పలు జిల్లాల్లో అకాల వర్షాలు.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన జొన్నలు

భానుడి ప్రతాపంలో పొద్దున్నుంచి ఎండవేడితో నిప్పుల కొలిమిలా ఉన్న రాష్ట్రంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది.  పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఎండవేడినుంచి కొంత ఉపశమనం లభించింది. అయితే కొన్ని చోట్ల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు, మక్కలు, జొన్నలు తడిసి రైతులకు తీరని నష్టం కలిగించింది. 

ఆదివారం (మే31) సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు ఆదిలాబాద్  మార్కెట్ యార్టులో జొన్నలు వర్షపు నీటిపాలయ్యాయి. కొనుగోలు చేయడంలో జాప్యం, జొన్న బస్తాలపై కప్పేందుకు సరైన టార్పాలిన్లు లేకపోవడంతో జొన్నలు తడిసిపోయాయి. జొన్న కొనుగోలులో జాప్యం కారణంగానే పంట నీటిపాలయ్యిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తడిసిన జొన్నలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 

మరో వైపు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో  ఈదురు గాలులతో కూటిన భారీ వర్షం కురిసింది.కొద్దిరోజులుగా ఎండ వేడితో సతమతమవుతున్న స్థానికులకే ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురవడంతో ఉపశమనం లభించింది.