అకాల వర్షాలకు వరి, మొక్క జొన్న పంటలకు భారీగా నష్టం

అకాల వర్షాలకు వరి, మొక్క జొన్న పంటలకు భారీగా నష్టం

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షాల ధాటికి వరి, మొక్క జొన్న, మామిడి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. అందులో ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల్లో ఈదురు గాలులకు ఇంటి పైన వేసిన రేకుల పై కప్పులు సైతం ఎగిరిపోయి.  కరెంట్ పోల్స్ క్రింద పడిపోయాయి.

ఏప్రిల్ 22న రాత్రి సంభవించిన అకాల వర్షాలకు మామిడి కాయలు నేల రాలాయి. వరి ధాన్యం తడిచిపోయిది. ఇక హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో  నిన్న కురిసిన భారీ వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన వరి ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చిన పంట నీళ్ల పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పలుచోట్ల ఈదురు గాలులకు భారీ వృక్షాలు రోడ్లపై విరిగిపడ్డాయి. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

ఇక కరీంనగర్ జిల్లాని హుజురాబాద్ మండలం తుమ్మనపల్లిలో ఈదురు గాలులు వీయడంతోNH-563 పై చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వడగళ్ల వానకు జిల్లాలోని చొప్పదండి, రామడుగు, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, హుజరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల్లో భారీగా వరి పంటకు, మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వాన పాలు కావడంతో ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. భారీ వరదకు వడ్లన్నీ  డ్రైనేజీలో కలిసి కష్టార్జితం నీటి పాలు కావడం పట్ల ఆవేదన చెందుతున్నారు.