
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(యూఓహెచ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 24.
పోస్టుల సంఖ్య: 52
పోస్టులు : అసిస్టెంట్ లైబ్రేరియన్ 04, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 01, సిస్టమ్ ప్రోగ్రామర్ 02, సీనియర్ అసిస్టెంట్ 03, ఆఫీస్ అసిస్టెంట్ 04, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 10, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 13, ల్యాబొరేటరీ అటెండెంట్ 05, లైబ్రరీ అటెండెంట్ 03. బ్యాక్ లాగ్ ఖాళీలు సీనియర్ అసిస్టెంట్ 02, ఆఫీస్ అసిస్టెంట్ 03, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 02.
ఎలిజిబిలిటీ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి12వ తరగతి, ఏదైనా డిగ్రీ, బి.టెక్/ బీఈ, ఎం.టెక్/ ఎంఈ, ఎ.ఫిల్/ పీహెచ్డీ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అప్లికేషన్ : ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం : సెప్టెంబర్ 25.
లాస్ట్ డేట్ : అక్టోబర్ 24.
అప్లికేషన్ ఫీజు : ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.500. ఇతరులకు రూ.1000.
సెలెక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు uohyd.ac.in వెబ్సైట్లో సంప్రదించగలరు.