భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఇద్దరు టెర్రరిస్టుల అరెస్ట్

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఇద్దరు టెర్రరిస్టుల అరెస్ట్

లక్నో: ఉగ్రవాదుల భారీ కుట్రను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) భగ్నం చేసింది. లక్నోలో భారీ బ్లాస్ట్‌కు ప్లాన్ చేసిన ఇద్దరు అల్‌ఖైదా టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరి వద్ద నుంచి భారీ పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న ఏటీఎస్.. వీరికి కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలపై విచారణ జరుపుతున్నారు. పేలుడు సామాగ్రిలో ప్రెషర్ కుక్కర్ బాంబ్‌ కూడా ఉండటం గమనార్హం.

ఏటీఎస్ అరెస్టు చేసిన టెర్రరిస్టులను మసీరుద్దీన్, మిన్హాజ్ అహ్మద్‌గా గుర్తించారు. వీరి ఇళ్లలో ఏటీఎస్ సోదాలు జరుపుతోంది. భారీ ఉగ్ర కుట్రను యూపీ ఏటీఎస్ ఛేదించిందని ఉత్తర ప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు.  అల్‌ ఖైదాకు చెందిన అన్సార్ గజ్‌వతుల్ హింద్‌తో సంబంధాలు ఉన్న ఇద్దరు టెర్రరిస్టులను అరెస్ట్ చేశామని తెలిపారు. కాగా, టెర్రరిస్టుల అరెస్టు, పేలుడు సామాగ్రి స్వాధీనం నేపథ్యంలో లక్నోతోపాటు సమీప జిల్లాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.