పెళ్లిలో ట్విస్టులు కొత్తేం కాదు. పెళ్లికి ముందు పెళ్లికూతురో, పెళ్లికొడుకో ఎస్కేప్ అవ్వటం తరచూ చూస్తుండేదే. ఇలాంటి ట్విస్టులు సినిమాల్లో కూడా ఉంటాయి.. వాటిని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంటుంది. కానీ ఇలాంటి ట్విస్టు ఎవరూ ఊహించి ఉండరేమో. ఎందుకంటే ఈ పెళ్లికూతురు ఇచ్చిన షాక్ అలాంటిది. అటు పెళ్లి కొడుకుతోపాటు పేరెంట్స్, బంధువర్గం మొత్తం నోరెళ్లబెట్టేలా షాకిచ్చి వెళ్లిపోయిన ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. అదేంటో చూద్దాం.
ఈమె మామూలు పెళ్లి కూతురు కాదు. పెళ్లికి ఒప్పుకుంది. ప్రథానం, మెహందీ ఫంక్షన్, పెళ్లికూతురు వగైరా కార్యక్రమాలు చేయించుకుంది. మండపంలో తలవంచి తాళి కట్టించుకుంది. ఏడడుగులు నడిచింది. పెళ్లి బరాత్ లో పెళ్లి కొడుకు కంటే ఈమెనే ఫుల్లు డ్యాన్స్ చేసింది.. ఇంకేముంది అన్ని సక్రమంగా జరిగాయి అనుకున్నారు ఇరు కుటుంబాలు. ఇక అప్పగింతల కార్యక్రమానికి ముందు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలో జరిగింది ఈ షాకింగ్ ఇన్సిడెంట్. పెళ్లి కూతురు పెళ్లి తంతు మొత్తం పూర్తయ్యాక.. రాత్రికి రాత్రే నగలన్నీ మూటగట్టుకుని లవర్ తో జంప్ అయ్యింది. బుధవారం (నవంబర్ 19) జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ఇంటివాడినయ్యాను.. రేపు నా భార్యను తీసుకుని ఇంటికి వెళ్లి చిలకపచ్చ కాపురం మొదలుపెడతా.. అనుకున్న ఆ పెళ్లికొడుకు ఇంకా షాకింగ్ నుంచి తేరుకోని పరిస్థితి.
ఎలా బయటపడింది..?
బారాబంకీ జిల్లాలోని ఘుఘంతర్ గ్రామానికి చెంది యువకుడు కొత్వాల్ నగర్ లోని బంకీ కి చెందిన యువతికి నవంబర్ 18న పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు వరుసగా ఒకదాని వెనుక ఒకటి ఎంతో ఆడంబరంగా పూర్తి చేశారు. పెళ్లికి సంబంధించిన బరాత్ కార్యక్రమం కూడా పూర్తి చేశారు. నవ దంపతులు ఇద్దరూ ఫుల్ డ్యాన్స్ చేస్తూ హంగామా చేసిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కానీ ఆ సంబరాలు ఎక్కువ సేపు మిగలలేదు. తెల్లారే సరికి సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఉదయం అప్పగింతల కార్యక్రమం మొదలు పట్టిన పేరెంట్స్ కు పెళ్లికూతురు లేదని తెలిసి షాక్ తగిలింది. ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వెతకటం ప్రారంభించారు.
కానీ అప్పగింతల టైమ్ దగ్గరపడుతుండటంతో.. పెళ్లికొడుకు ఫ్యామిలీ నిలదీయటంతో.. అసలు విషయం బయటపడింది. రాత్రికి రాత్రే జంప్ అయినట్లు చెప్పారు. ఈ ఘటనతో షాక్ తిన్న పెళ్లికొడుకు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ డ్రామాలో పెళ్లి కూతురు అక్కా చెళ్లెళ్లకు కూడా పాత్ర ఉందని.. వాళ్ల సహకారంతోనే ఆమె లేచిపోయినట్లు ఆరోపించాడు పెళ్లికొడుకు.
పెళ్లికి ముందే లవర్ తో ఓసారి లేచిపోయిన యువతి:
బంకీ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాక.. కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు పోలీసులు. స్టేషన్ ఇంచార్జి మిథిలేష్ చౌహాన్ మాట్లాడుతూ.. ఆ పెళ్లి కూతురు అప్పటికే ఒకసారి సదరు యువకుడితో లేచిపోయినట్లు ఎస్సై తెలిపారు. కంప్లైంట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని.. మొబైల్ ఫోన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
DJ पर दूल्हे संग डांस कर रही ये दुल्हन विदाई से ठीक पहले गायब हो गई। जयमाला हुई, 7 फेरे हुए। मांग में सिंदूर भरा गया। विदाई की बारी आई तो दुल्हन लापता थी। बिना दुल्हन बारात वापस लौट गई। दूल्हे सुशील ने 3 बीघा जमीन गिरवीं रखकर शादी की तैयारियां की थी।
— Sachin Gupta (@SachinGuptaUP) November 20, 2025
📍जिला बाराबंकी, यूपी pic.twitter.com/VJlNPJgjXP
