పేదలకు మరో మూడు నెలలు ఫ్రీ రేషన్

పేదలకు మరో మూడు నెలలు ఫ్రీ రేషన్

యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కొత్త కేబినెట్ తొలి సమావేశంలోనే కీలక  నిర్ణయం తీసుకున్నారు. పేదలకు అందించే ఉచిత రేషన్ బియ్యాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. జూన్ 30 2022 వరకు యూపీలో పేదలకు ఫ్రీ రేషన్ బియ్యాన్ని అందజేస్తామని తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పేదలకు అందించే ఉచిత రేషన్ బియ్యాన్ని మరో మూడు నెలలు అందజేస్తామని  చెప్పారు యోగి ఆదిత్యనాథ్. ఈ పథకం ద్వారా 15 కోట్ల మంది లబ్ధిదారులకు మేలు జరుగుతుందన్నారు. అంతేకాదు ప్రతి ఇంటికి 5 కిలోల బియ్యం అదనంగా లభిస్తుంది. 2020లో కోవిడ్ మహమ్మారి దేశంలోకి వచ్చినప్పుడు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసింది. 

మరిన్ని వార్తల కోసం

నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

రాజీవ్ గృహాలను పరిశీలించిన సీఎస్ సోమేశ్