నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ బాదుడు కొనసాగుతోంది. లీటర్ పెట్రోల్ పై ఇవాళ 89 పైసలు పెంచారు. డీజిల్ మీద 86 పైసలు పెంచారు. గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు చమురు ధరలు పెరగడం గమనార్హం. నాల్రోజుల్లో పెట్రో ధరలు దాదాపు 3 రూపాయల 20 పైసలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.80 పైసలకు చేరింది. డీజిల్ ధర రూ.98.10కి చేరింది.  దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.81గా, ముంబైలో రూ.112.51, కోల్‌కతాలో రూ.106.34, చెన్నైలో రూ.103.67, బెంగళూరులో రూ.103.11, జైపూర్‌లో రూ.109.73, లక్నోలో 97.67కి లభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్  ధర రూ.110.91, డీజిల్ ధర రూ.97.24కి పెరిగాయి.  వరంగల్‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.40, డీజిల్ ధర రూ.96.75గా ఉంది.

For More News..

ఉగాది తర్వాత వడ్ల ఉద్యమం

ఐదుసార్లు అవమానించినా భరించినం