ఐదుసార్లు అవమానించినా భరించినం

ఐదుసార్లు అవమానించినా భరించినం

సీఎం కేసీఆర్ సూచన మేరకు పీయూష్ గోయల్‎ను కలిస్తే.. ఐదుసార్లు అవమానించినా భరించామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ అయి ఉండి.. ఒక్కసారైనా తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడారా? అని ప్రశ్నించారు. ‘కేంద్రం కావాలనే తెలంగాణపై తప్పుడు ప్రచారం చేస్తోంది. మెడమీద కత్తి పెడితే రైతుల ప్రయోజనాల కోసం.. బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసిచ్చాం. కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లాలని 16సార్లు లెటర్లు రాశాం. నెలకు 10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రానికి పంపగలం.. తీసుకెళ్లమంటే మా దగ్గర ర్యాకులు లేవని వాళ్లే అన్నారు. పైగా సమయానికి సప్లై చేయడం లేదని అభాండాలు వేస్తున్నారు. మేం చేసిన ప్రయత్నాలన్నీ కిషన్ రెడ్డికి తెలిసేలా లెటర్లు పంపిస్తాం. వాటిని చూసి అయినా రైతులను ఆదుకోవడానికి ప్రయత్నించాలని కోరుతున్నాం’ అని మంత్రి గంగుల అన్నారు.