ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ వైద్యకళాశాలలో జరిగిన ఆపరేషన్ వివాదానికి దారితీసింది. ఓ వ్యక్తికి తన అనుమతి లేకుండా లింగమార్పిడి చేశారు. ముజాహిద్ (20) అనే వ్యక్తి ఆరోగ్యరీత్యా ఆపరేషన్ చేయించుకోవాలని ముజఫర్ నగర్ వైద్యకళాశాల వైద్యులను సంప్రదించాడు. ఇక అంతే వారు ఓం ప్రకాశ్ అనే వ్యక్తితో కుమ్మక్కయి ముజాహిద్‌కు లింగమార్పిడి చేసి మహిళగా మార్చారు. మన్సూర్‌పూర్‌లోని బేగ్‌రాజ్‌పూర్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముజాహిద్‌కు ఆపరేషన్ చేసిన తరువాత ఆయన పరిస్థితిని చూసి చాలా ఆవేదన చెందాడు. ఇలా ఎందుకు చేశారని ఆరా తీయగా ఓం ప్రకాశ్ అనే వ్యక్తి ఇలా చేయించాడని తెలిపారు. సంజక్ గ్రామానికి చెందిన ముజాహిద్ ను.. ఓం ప్రకాశ్ అనే వ్యక్తి రెండేళ్ల నుంచివేధిస్తున్నాడని.. అతను తనను మోసం చేశాడని ముజాహిద్ ఆరోపించాడు. బేగ్‌రాజ్‌పూర్ మెడికల్ కాలేజీ వైద్యులతో కుమ్మక్కయి తన జీవితాన్ని నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు సమాజం నుంచి.. తన కుటుంబం నుంచి అనేక ఇబ్బందులు వస్తాయని ముజాహిద్ తెలిపాడు. ముజాహిద్ తో కలిసి జీవించాలని ఉన్నట్లు ఓం ప్రకాశ్ తనతో చెప్పాడు. నీ తండ్రికి ఉన్న భూమి స్వాధీనం చేసుకుంటానని ఒప్పుకోకపోతే కాల్చి చంపాలని చెప్పినట్టు ఓం ప్రకాశ్ తనతో చెప్పినట్టు ముజాహిద్ తెలిపాడు. . సంచలనం సృష్టించిన ఈ కేసు విషయంలో ముజాహిద్ కు మద్దతుగా భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నిరసన తెలిపింది.
నిన్ను మహిళగా( ముజాహిద్ ను) మార్చానని ఓ ప్రకాశ్ చెపుతూ .. నీవు నాతో జీవించాలి.. చట్ట పరంగా మన వివాహం అయ్యేలా అన్ని డాక్యుమెంట్స్ ను తయారు చేశానని.. నేను లాయర్ నని చెప్పాడు. మీ తండ్రిని నేనే కాలుస్తను. మీ వాటాకు వారసత్వంగా వచ్చే భూమి నాపేరున పెట్టాలని ఓం ప్రకాశ్ బెదిరించాడు. ఆ తరువాత దానిని విక్రయించి లక్నో వెళ్లి స్థిరపడదామని ముజాహిద్ తో ఓ ప్రకాశ్ అన్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన బీకేయూ కార్యకర్తలు.. రైతు నాయకుడు శ్యామ్‌పాల్ సంబంధిత వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కాలేజీ వద్ద నిరసనకు దిగారు. సమగ్ర విచారణ జరిపిస్తామని పోలీసులు ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. అనుమతి లేకుండా అవయవాల మార్పిడి చేయడం ఒక పెద్ద కుంభకోణంగా మారిందని శ్యామ్ పాల్ ఆరోపించారు. కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని బేగ్‌రాజ్‌పూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి అక్రమాలకు పాల్పడుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనకు పాల్పడిన వారిని చట్టరీత్యా శిక్షించాలని శ్యామ్ పాల్ డిమాండ్ చేశారు. ఈ ఘటన జూన్ 3 వ తేదీ జరగ్గా ముజాహిద్దీన్ తండ్రి జూన్ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అక్రమంగా లింగమార్పిడికి పాల్పడిన నిందితుడు ఓం ప్రకాశ్‌ను అరెస్టు చేసినట్లు పాల్ చెప్పారు. ఈ భాదకరమైన సంఘటన ముజాహిద్ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని.. నష్ట పరిహారంగా రూ. 2 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఓంప్రకాష్‌ను అరెస్టు చేయడంతో పాటు.. కేసుతో సంబంధం ఉన్న ఆసుపత్రి సిబ్బందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. దోషులకు చట్టపరమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ముజఫర్‌నగర్ పోలీసు అధికారి రామశిష్ యాదవ్ తెలిపారు.
