
యూపీలో ఓ వలస కార్మికుడు క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తింద్వారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహార్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. జగదీష్ ప్రసాద్(35) అనే వ్యక్తి ఆరు నెలల క్రితం.. బతుకుదెరువు కోసం సూరత్ వెళ్లాడు. కరోనా నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో .. మే 20 న తన స్వస్థలానికి వెళ్లాడు. అయితే అక్కడి అధికారులు వలస కార్మికులను గ్రామంలోనికి అనుమతించకుండా వారిని క్వారంటైన్ సెంటర్‌కి తరలించారు. బుధవారం అక్కడి నుంచి తప్పించుకొన్న జగదీశ్ ప్రసాద్.. అతడి మామ ఇంటికి వెళ్లి ఉరివేసుకున్నాడు. అయితే సంఘటనకు ముందు భార్యతో రేషన్ విషయమై గొడవ పడ్డట్లు అతడి మామ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.