అమ్మాయిలు స్వేఛ్చగా స్కూల్స్, కాలేజీలకు వెళ్తున్నారు

అమ్మాయిలు స్వేఛ్చగా స్కూల్స్, కాలేజీలకు వెళ్తున్నారు

ఉత్తర్ ప్రదేశ్‌లో పర్యటించారు ప్రధాని మోడీ. కాన్పూర్‌లోని దేహత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... యూపీలోని బీజేపీ పాలనలో ముస్లీం అమ్మాయిలంతా  సురక్షితంగా ఉన్నారన్నారు. యూపీలో చాలామంది ముస్లీం బాలికలు, అమ్మాయిలు.. ఇప్పుడు స్కూల్స్, కాలజీలకు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై మాట్లాడుతూ.. ముస్లీం బాలికలు బయటకు వెళ్లేటప్పుడు ఈవ్ టీజింగ్ సమస్యలు చవి చూశారన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు క్రిమినల్స్ అందర్నీ అరెస్ట్ చేసిందన్నారు. 

మరోవైపు యూపీలో ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాదీపై కూడా విమర్శలు గుప్పించారు ప్రధాని. ఎస్పీ ప్రతీ సారి తాము పొత్తు పెట్టుకొనే పార్టీలను మారుస్తూ ఉందన్నారు. ఈ విధంగా పొత్తు పార్టీలను మారుస్తుంటే.. వాళ్లు ప్రజలకు ఇంకేమి సేవ చేస్తారని ప్రశ్నించారు మోడీ. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం జరుగుతున్న 2022 ఎన్నికల కోసం... పలు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ అకాలీదళ్, చిన్న పార్టీలతో అఖిలేశ్ యాదవ్‌కు పొత్తు ఏర్పడింది.

ఇక 2017 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టకుంది. ఇక లోక్‌సభ ఎన్నికల కోసం మాయావతి బహుజన్ సమాజ్‌ వాదీ పార్టీతో పొత్తు కొనసాగింది. ప్రస్తుతం యూపీలో రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 55 నియోజకవర్గాల్లో 9 జిల్లాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు మార్చి 10న రానున్నాయి. 

ఇవి కూడా చదవండి:

కేసీఆర్ కు బీజేపి భయం పట్టుకుంది

మోడీ ఫ్యాషన్ షో తప్ప చేసిందేమి లేదు