నిజంగా ఇతను డాక్టరేనా..? తలకు గాయమైతే ఫెవికాల్ పెట్టి అతికించాడు

నిజంగా ఇతను డాక్టరేనా..? తలకు గాయమైతే ఫెవికాల్ పెట్టి అతికించాడు

షాకింగ్ ఇన్సిడెంట్​..తలకు గాయం అయ్యిందని చికిత్స కోసం డాక్టర్‌ను ఆశ్రయించిన వ్యక్తి ఊహించని పరిస్థితిని ఎదుర్కొన్నాడు. చికిత్స అందించాల్సిన డాక్టర్ చేసిన పని చూసి ఎవ్వరైనా ఇతను నిజంగా డాక్టరేనా?” అని ఆశ్చర్యపోవాల్సిందే.. ఇటువంటి ఘటనలు వైద్య వ్యవస్థలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పెద్ద చర్చకు దారితీసింది.

యూపీలోని మీరట్​ లో  డాక్టర్ల​ నిర్లక్ష్యంపై షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల బాలుడికి తలపై కంటి దగ్గర తీవ్రగాయమైతే కుట్లు వేయడానికి బదులుగా ఓ ప్రైవేట్​ డాక్టర్​ ఫెవీక్విక్​ పెట్టి అతికించాడు. తల్లిదండ్రులు ఇంజెక్షన్ ,సరైన డ్రెస్సింగ్ చేయాలని గొడవకు దిగితే అది అవసరం లేదని చెప్పాడు ఆ డాక్టర్​. మరుసటి రోజు ఉదయం బిడ్డను మరొక ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ మూడు గంటల చికిత్స తర్వాత ఫెవిక్విక్​ను తొలగించి గాయానికి కుట్లు వేశారు. ఇక ప్రైవేట్​ డాక్టర్​ నిర్లక్ష్యంపై ఆగ్రహించిన చిన్నారి పేరెంట్స్​ బంధువులు ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.  

►ALSO READ | కేరళలో దడపుట్టిన కొత్త వైరస్: శబరి వెళ్లే స్వాములు ముక్కులోకి నీళ్లుపోకుండా చూస్కోండి..!

ఇలాంటి సంఘటనలు  ఫిబ్రవరి ప్రారంభంలో కర్ణాటకలో కూడా జరిగింది. ఓ బాలుడి చెంపకు లోతైన గాయం కాగా చికిత్స వస్తే  ఓ నర్సు కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్ వేసింది.