
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ పార్కులో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నగరంలో స్నాచింగ్ కి పాల్పడుతున్న మహేష్, వీరబాబు, వినయ్, హరీష్ నలుగురు స్నాచర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు మహేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. నిందితుల నుంచి 30గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.
శుక్రవారం ఉదయం ఉప్పల్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలోని ఓ పార్కులో ప్రవీణ(42) తన భర్తతో కలిసి వాకింగ్ చేస్తుండగా వెనకనుంచి వచ్చిన గుర్తుతెలియన వ్యక్తులు ఆమెను బెదిరించారు. భార్యభర్తలను కొట్టి మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడు, చెవి కమ్మలు లాక్కెళ్లారు చైన్ స్నాచర్లు.
షాక్ నుంచి తేరుకున్న ప్రవీణ, ఆమె భర్త వెంటనే 100 ద్వారా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం (సెప్టెంబర్ 2) న నిందితులను అరెస్ట్ చేశారు. ప్రవీణ ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చైన్ స్నాచర్లను పట్టుకున్నారు రాచకొండ పోలీసులు.