మార్చి 17న ఉపేంద్ర కబ్జా

మార్చి 17న ఉపేంద్ర కబ్జా

కమర్షియల్‌‌ సినిమాల్లోనూ కొత్త తరహా కాన్సెప్టులను టచ్ చేస్తూ, హీరోగా స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ఉపేంద్ర.  అందుకే ఆయన సినిమాలకు కన్నడతో పాటు తెలుగులోనూ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు  ‘కబ్జా’ అనే ప్యాన్‌‌ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆర్‌‌.చంద్రు దర్శకుడు. శ్రియా హీరోయిన్‌‌. సుదీప్, ప్రకాష్‌‌ రాజ్‌‌, జగపతిబాబు, కబీర్ సింగ్‌‌ దుహా, బోమన్‌‌ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాను మార్చి 17న వరల్డ్‌‌ వైడ్‌‌గా రిలీజ్ చేయనున్నట్టు మంగళవారం ప్రకటించారు. 1947 నుంచి 1984 మధ్య కాలంలో న‌‌డిచే క‌‌థ‌‌ ఇది. స్వాతంత్య్ర స‌‌మ‌‌ర యోధుడు కొడుకు మాఫియా వ‌‌రల్డ్‌‌లో ఎలా చిక్కుకున్నాడు. త‌‌ర్వాత ఏ రేంజ్‌‌కు చేరుకున్నాడ‌‌నే పాయింట్‌‌తో ఈ సినిమాను తెర‌‌కెక్కించారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించాడు.