గత రెండేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన హన్సిక.. త్వరలో ఓ వెబ్ సిరీస్‌తో తిరిగి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘గల్లీ’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. హన్సికతో పాటు జేడీ చక్రవర్తి, శ్రద్ధా శ్రీనాథ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకుడు. ఆర్కా మీడియా బ్యానర్‌పై ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.
రీసెంట్‌గా ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది. ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ రస్టిక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ గల్లీ క్రికెట్ మ్యాచ్.. ఓల్డ్ సిటీ గొడవలకు ఎలా కారణమైంది అనేది మెయిన్ కాన్సెప్ట్ అని అర్థమవుతోంది.
ఇందులో పాతబస్తీకి చెందిన ముస్లిం యువతిగా హన్సిక కనిపించింది. హీరో సుధీర్ బాబుతో పాటు హన్సికకు ఇదే ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా త్వరలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.ఇక నాలుగేళ్ల క్రితం బిజినెస్‌మెన్ సొహైల్ ఖతురియాను ప్రేమించి పెళ్లాడిన హన్సిక.. ఇటీవలే విడాకులతో వివాహ బంధానికి ముగింపు పలికింది. విడాకుల సమస్య కొలిక్కి రావడంతో తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెడుతోంది.
ఇకపోతే, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గతంలో చందమామ కథలు మూవీతో నేషనల్ అవార్డు సాధించాడు. ఆ తర్వాత గుంటూర్ టాకీస్, పిఎస్‌వి గరుడ వేగ, గాండీవదారి అర్జున వంటి సినిమాలు చేశాడు.
