ఎండాకాలం వచ్చిందంటే దొంగల భయం ఉంటుంది. ఎక్కడైనా ఇంటికి తాళం ఉందంటే దొంగలు రాత్రికి రాత్రే దోచేసుకుంటుంటారు. కానీ పట్టపగలే అది కూడా దర్జాగా వచ్చి దొంగతనం చేయడం ఎప్పుడైనా చూసారా.... సాధారణంగా దొంగలు ఇంట్లో బంగారం, వెండి లేదా విలువైన వస్తువులు ఎత్తుకెళ్తుంటారు. కానీ వీళ్ళు ఎత్తుకెళ్లింది ఏంటో తెలిస్తే వీళ్ళను ఎం అనాలో కూడా ఆలోచీస్తారు.... విషయం ఏంటంటే.....
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత ఉందనే భయాల మధ్య, బెంగళూరులో ఒక వింత దొంగతనం జరిగింది. గురువారం రోజు ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటి నుంచి రెండు ఎల్‌పిజి సిలిండర్లను దర్జాగా దొంగిలించారు.
ఏం జరిగిందంటే... బేగూర్ ప్రాంతంలో జరిగిన ఈ దొంగతనం దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి. ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై హెల్మెట్లు పెట్టుకుని ఓ ఇంటి ముందుకు వచ్చారు. ఒకరు బండి పై బయట కాపలా ఉండగా, మరొకరు ఇంట్లోకి వెళ్లి నిమిషాల వ్యవధిలోనే రెండు సిలిండర్లను దొంగిలించి బయటకు తీసుకొచ్చాడు.
రాష్ట్రమంతా ఉగాది పండుగ జరుపుకుంటున్న రోజే ఈ దొంగతనం జరగడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినప్పటికీ, దొంగల ఆచూకీ ఇంకా లభించలేదు.
పశ్చిమ ఆసియా (మధ్యప్రాచ్యం)లో జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్ సప్లయ్ ఆగిపోతుందేమోనని ప్రజలు అయోమయం అవుతున్నారు. గ్యాస్ దొరకదనే భయంతో చాలామంది ఎలక్ట్రిక్ 'ఇండక్షన్ స్టవ్'లను కొంటున్నారు. వీటికి డిమాండ్ పెరగడంతో ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో ఇండక్షన్ స్టవ్‌ల స్టాక్ కూడా అయిపోయింది.
