అది అతి పెద్ద రైల్వేస్టేషన్. అదే చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. చెన్నై రైల్వేస్టేషన్ అంటే రోజూ వందల రైళ్లు.. లక్షల మంది ప్రయాణికులతో రోజూ కిటకిటలాడుతుంది. ఇలాంటి రైల్వేస్టేషన్ లో వింత పరిస్థితిని ఓ ప్రయాణికుడు వెలుగులోకి తీసుకురావటం.. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అది చెన్నై రైల్వేస్టేషన్. అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. ఓ వ్యక్తి మూత్రవిసర్జన కోసం వెళ్లాడు. బోర్డుపై 5 రూపాయలు అని రాసి ఉంది. అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం 10 రూపాయలు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడు. 10 రూపాయలు కట్టు.. మూత్రం పోసుకో అంటూ తెగేసి చెప్పాడు. మూత్రవిసర్జన కోసం 10 రూపాయలు ఏంటీ అని ప్రశ్నిస్తే.. పోసుకుంటే పోసుకో లేకపోతే బయటకు వెళ్లు.. రైలు పట్టాలపై పోసుకో అంటూ దురుసుగా చెప్పాడు. చిన్న పిల్లల మూత్రవిసర్జనకు కూడా 10 రూపాయలు వసూలు చేయటం అనేది దారుణం అని.. ఓ కుటుంబంలో నలుగురు ఉంటే.. నలుగురు మూత్రవిసర్జన చేస్తే 40 రూపాయలు కట్టాలా అంటూ అవాక్కవుతున్నారు నెటిజన్లు. ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో.. నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షించింది.
రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో చుచ్చూ.. మూత్ర విసర్జన కోసం డబ్బులు వసూలు చేయటం అనేది దందాగా మారిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మినిమం అవసరాల కోసం కూడా డబ్బులు వసూలు చేయటం ఏంటని నిలదీస్తున్నారు నెటిజన్లు. మూత్ర విసర్జన అనేది కామన్.. ఇలాంటి దానికి కూడా డబ్బులు వసూలు చేయటం అనేది దుర్మార్గం అని దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.
చెన్నై రైల్వేస్టేషన్ అనేది రోజూ రద్దీగా.. లక్షల మంది ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఇలాంటి రైల్వేస్టేషన్ కనీసం మూత్రవిసర్జనకు కూడా డబ్బులా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అత్యవసర.. ఎమర్జెన్సీ అంశాలకు ఉచితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.
10 రూపాయలు పెట్టలేని వాళ్లు ఏం చేస్తారు.. రోడ్డు పక్కన పోస్తారు.. రైలు పట్టాలపై పోస్తారు.. ప్లాట్ ఫాంలపై పోస్తారు.. అప్పుడు గబ్బు గబ్బు అవుతుంది కదా అంటూ తమ అభిప్రాయాలను చెప్పుకొస్తున్నారు నెటిజన్లు. ప్రతిదానికీ డబ్బులు అంటే దేశం గబ్బు పట్టిపోతుందంటూ చురకలు అంటిస్తున్నారు నెటిజన్లు.
ఏదిఏమైనా పబ్లిక్ ప్లేసుల్లో కనీసం మూత్ర విసర్జనకు డబ్బులు లేకుండా చూడాలంటూ 90 శాతం మంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రైల్వేశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Charging ₹10 for urinal at Chennai Central railway station. Basic needs should be accessible for everyone. Let the people’s voice be heard@GMSRailway pic.twitter.com/Ma3DwqJQ5S
— Sai Jegadheesh (@saijegadheeshh) March 20, 2026
