హైదరాబాద్, వెలుగు: లాంగ్వేజీ పండిట్ పోస్టుల అప్‌గ్రెడేషన్ కోసం సర్కారు ఇచ్చిన సర్వీస్ రూల్స్ జీవోలను సమర్థిస్తూ లాంగ్వేజీ పండిట్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు శుక్ర వారం తీర్పు ఇచ్చింది. ఎస్జీటీలు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్‌లో వేసిన కేసును డిస్మిస్ చేసిం ది. దీంతో లాంగ్వేజీ పండిట్లు సుప్రీంకోర్టు వద్ద స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకున్నా రు.
ఈ సందర్భంగా ఆర్‌యూపీపీ రాష్ట్ర అధ్య క్షుడు సి.జగదీశ్, ప్రధాన కార్యదర్శి నర్సింలు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా లాంగ్వేజీ పండి తులకు రావాల్సిన న్యాయమైన ప్రమోషన్లు కూడా రాకుండా, వారికి కేటాయించిన పోస్టులను అలాట్ చేయకుండా కొందరు అడ్డుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు చెల్లుబాటు అవుతాయని, అప్‌గ్రెడేషన్ పోస్టులతో పాటు ప్రమోషన్ పోస్టులో కేవలం లాంగ్వేజీ పండిట్లనే పరిగణించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిందని వెల్లడించారు.